Home » CV Anand
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుకాణాలు, ఫుడ్ కోర్టులు, వ్యాపారసముదాయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్‌షాపులు.. కచ్చితమైన సమయపాలన పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రిపూట సమయానికి దుకాణాలు మూసివేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు.
Telangana: భక్తులకు సీపీ సీవీ ఆనంద్ ఓ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇస్తోందని.. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందన్నారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు... సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోందన్నారు.
హైదరాబాద్: 11 రోజులపాటు మండపాల్లో పూజలందుకున్న లంబోదరుడు ఆశేష భక్త జనం నుంచి వీడ్కోలు అందుకుని గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
Telangana: గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా త్వరగా గణేష్ నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు ఉన్నతాధికారులతో ఈరోజు(ఆదివారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న జరిగే గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.
Telangana: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... గణేష్ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వినాయక నిమజ్జన ఊరేగింపు, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపుల నేపథ్యంలో సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(Police Commissioner CV Anand) తెలిపారు.
గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు. అదనపు, జోనల్ కమిషనర్లతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ సిటీ పరిధిలో పండుగలు, ఈవెంట్లలో నిర్వహించే బందోబస్తు క్వార్టర్, సెమీఫైనల్స్ లాంటివి అయితే.. గణేష్ బందోబస్తు ఫైనల్స్ వంటిదని హైదరాబాద్ సిటీ పోలీస్‌కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...