Home » Cyber attack
వర్క్ ఫ్రం హోం(Work from home) పేరుతో సైబర్ నేరగాళ్ల(Cybercriminals) చేతిలో ఓ మహిళ మోసపోయిన ఘటన శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలో నివసించే లహరి గృహిణి. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాక్ ఫ్రంట్ కాలనీలో నివసిస్తుంది.
కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్ అవర్(Golden hour)లో ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.
అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ క్రిమినల్(Cyber criminal)ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షల కాజేశారు.
సాధారణంగా సైబర్ నేరగాళ్లు.. మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. కాని సైబర్ నేరగాళ్లకే తన చాకచక్యంతో ఝలక్ ఇచ్చిందో మహిళా టీచర్. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు..
సైబర్ నేరగాళ్లు.. రూ.32.68 లక్షల చోరీ చేశారు. ఇరాన్‌కు పంపిన పార్సిల్‌పై ఉన్న వివరాలు మనీ లాండరింగ్(Money laundering) కేసుల్లో నమోదై ఉన్నాయని నగరానికి చెందిన మహిళను భయపెట్టి, ఆమె ఖాతా నుంచి రూ.15.76 లక్షలను, గూగుల్ మ్యాప్‌కు రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని నగరవాసిని నమ్మించి, అతని ఖాతా నుంచి రూ.16.68 లక్షలు కాజేశారు.
ఎస్బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్ఎక్స్(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు.
సైబర్ సెక్యూరిటీలో లోపాలు.. పోలీస్ డిపార్టుమెంట్(Police Department)కు సవాల్‌గా మారాయి. దేశంలోనే మొదటిసారిగా, ఎవరూ అందుబాటులోకి తేని విధంగా సైబర్ సెక్యూరిటీబ్యూరోను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్ ఉన్నతాధికారులు గతేడాది గొప్పగా చెప్పారు. ఎలాంటి సైబర్ ముప్పునైనా ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఓ నటుడికి ఇటీవల ఓ అనూహ్య అనుభవం ఎదురైంది. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు.