Home » Cyber Crime
కూలి పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగా ళ్లు రూ.1,73,001 కాజేశారు. తొలుత సిమ్ కార్డును బ్లాక్ చేసి.. ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు.
వారంతా ఉన్నత చదువులు చదివిన వారు.. ఒకరైతే ఐఐటీ పట్టభద్రుడు.. అయినా, వారికి కనీస సంస్కారం లేకపోయింది. తమ స్థాయిని మరిచి, నీచంగా వ్యవహరించారు..
సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో హనీట్రాప్ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.38.73 లక్షలు దోచేశారు. వలపు వలలో పడి తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారంలో ఈగల్ ఎక్స్‌పర్ట్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ సరోజా శిష్యంత్‌ను తాజాగా అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ షికా గోయల్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ‘ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ.50 వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.
ఈ ప్రశ్నలకు ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ గ్రేటర్ టెహ్రాన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పర్వీజ్ సర్వారీ మంగళవారం చేసిన ఓ ప్రకటన అవుననే సమాధానం చెబుతోంది. ‘‘ఈ సంక్షోభ సమయంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలి.
సైబర్ నేరగాళ్లు రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దు అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన యువకుడు (36) ఉద్యోగం మారే ప్రయత్నాల్లో తన బయోడేటాను పలువురు స్నేహితులకు పంపాడు.
మహిళా టీచర్‌తో సోషల్‌మీడియాలో స్నేహం నటించిన సైబర్ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి రూ.2.02 లక్షలు కొట్టేశాడు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్‌కు గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్ మెసేంజర్ నుంచి కాల్ వచ్చింది.
యూకేలో ఉంటున్న స్నేహితుడిలా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.2.05 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి యూకేలో చదువుకుంటున్న స్నేహితుడున్నాడు.