Home » Cyber Crime
దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో 33 శాతం సైబర్ క్రైం(Cyber Crimes) కేసులు పెరిగాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్‌ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి.
ఇటివల కాలంలో క్రెడిట్ కార్డు(Credit Card) వాడకం సర్వ సాధారణం అయిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటివల పలువురు దుండగులు మాత్రం ఈ క్రెడిట్ కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతూ అనేక మందిని చీట్ చేస్తున్నారు. అయితే ఇటివల వెలుగులోకి వచ్చిన క్రెడిట్ కార్డు మోసాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కమిషనరేట్ పరిధిలో నెల రోజుల క్రితం వరకు నమోదైన కేసుల్లో సరాసరి మొత్తం రోజుకు రూ. 1.50 కోట్లు కాగా, ఈనెల ప్రారంభం నుంచి నమోదవుతున్న కేసుల్లో ప్రతి రోజు రూ. 2 కోట్ల మేర మోసం జరిగినట్లు తెలుస్తోందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) తెలిపారు.
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీ ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల నుంచి ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. గతంలో అయోధ్య రామ మందిర్ సహా అనేక కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరుతో దుండగులు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చేసి డబ్బులు(money) దోచుకుంటున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్‌కు సంబంధించి మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్‌లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా, నగర వాసికి ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో నేరగాళ్లు టోకరా వేశారు..
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో.. సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో కొందరు దుండగులు భారీ మోసానికి పాల్పడ్డారు.