Home » Cyber Crime
నెట్ కనెక్షన్ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో వెదికిన నగరవాసి సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.1.09 లక్షలు పోగొట్టుకున్నాడు. బహదూర్‌పురాకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన యాక్ట్ ఫైబర్ సర్వీసుల కోసం ఆన్‌లైన్‌లో వెదికాడు.
ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.
ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.12.56 లక్షలను కాజేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు సెప్టెంబరు ఒకటిన ఇన్‌స్టాగ్రాంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ యాడ్‌ను చూశాడు.
తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్‌టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్ నేరగాళ్లు ఇద్దరు నగరవాసుల నుంచి రూ.6.08 లక్షలు కాజేశారు. బేగంబజార్‌కు చెందిన వ్యక్తి(50)కి వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు సందేశం పంపారు.
ఆర్‌టీఓ చలాన్, పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్ నేరగాళ్లు నాలుగు రోజుల వ్యవధిలో నగరానికి చెందిన ముగ్గురు నుంచి రూ.4.85 లక్షలు కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన వ్యక్తి (47) సంప్రదించిన నేరగాళ్లు ‘మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయి.
మీకు కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయి. మీపై మనీల్యాండరింగ్ కేసులు నమోదయ్యాయి. అందుకే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’ అంటూ వృద్ధుడిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.26.06 లక్షలు దోచేశారు.
దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పుంజుకుంటున్నాయ్. ఈ క్రమంలో వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా తీసుకుని వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ట్రాయ్.. ప్రైవేట్ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు.. ఆర్బీఐ.. తదితర ప్రభుత్వ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల మాయలో అమాయకులు పడిపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధుడి వద్ద రూ.80.64 లక్షలు, ఆన్‌లైన్ పార్ట్‌టైం జాబ్ ఆఫర్ అంటూ రూ. 8.18 లక్షలు స్వాహా చేసిన ఘటనలు వెలుగు చూశాయి.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోను డీపీగా పెట్టిన నేరగాళ్లు ఆన్‌లైన్ పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఓ ప్రకటనను సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆ లింకును క్లిక్ చేసిన వృద్ధుడిని బురిడీ కొట్టించి రూ.14.35లక్షలు కొల్లగొట్టారు.