Home » Cyber Crime
హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.
నానో బనానా మాయలో పడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.
ఎంత చదువుకున్నా.. ఎంత పరిజ్ఞానమున్నా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మేవాళ్లే ఎక్కువ. వాళ్ల ఉచ్చులోపడి లబోదిబోమనే వాళ్లే. కానీ, తిరుపతికి చెందిన శానిటేషన్ వర్కర్ ఒకరు మాత్రం మీ వేషాలు నా దగ్గర కాదంటూ సోమవారం తనకు ఫోనుచేసిన అమ్మాయికి దీటుగా ఎదురు తిరిగారు.
ఆన్లైన్లో అతి తక్కువ ధరకు బల్క్‌గా వస్తువులను విక్రయిస్తున్నట్లు నమ్మించి రూ.39.7 లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన 28 ఏళ్ల వ్యాపారికి ఆన్లైన్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు.
పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్ చూస్తుండగా, నోమురా యాప్ ప్రమోషన్ వీడియో కనిపించింది.
పోస్టల్ శాఖ పేరిట సర్క్యులేట్ అవుతున్న ఓ ఫేక్ ఎస్ఎమ్ఎస్ స్కామ్‌పై పీఐబీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి మెసేజీలు వస్తే స్పందించొద్దని, మెసేజ్‌ల్లోని లింకులపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.
‘మీపై మనీల్యాండరింగ్ కేసులు నమోదు అయ్యాయి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అంటూ బెదిరిగించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.21లక్షలు దోచేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. ముంబై పోలీస్ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు.
పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ2.90 లక్షలు బదిలీ చేసుకున్నారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో ఏపీకే లింక్ పంపారు.
‘నువ్వు దేశ ద్రోహానికి పాల్పడ్డావు. నీపై అరెస్ట్ వారెంట్ వచ్చింది’ అంటూ భయపెట్టాడు. డబ్బులు కడితే కేసు నుంచి బయటపడొచ్చని నమ్మబలికాడు. రాఘవేంద్రరావు అది నిజమేనని నమ్మాడు.
లాటరీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ ఏపీకే లింక్‌లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కరెంట్ బిల్లు పెండింగ్, వాటర్ బిల్లు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు.