Home » Cyclone
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాంటి వేళ మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు... మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లాల అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాయుగుండం తీరం దిశగా వస్తున్నందున 8 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరిక జారీచేశారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్నటి (మంగళవారం) నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సీఎం సమీక్షించారు.
వాయుగుండం గురువారం చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఎవరికీ సాధ్యం విన్యాసాలను కొందరు అవలీలగా చేయడం చూస్తుంటాం. బైకులను భుజాలపై మొసుకెళ్లే వారు కొందరైతే, మరికొందరు వాటిని ఏకంగా బస్సు పైకి లోడ్ చేస్తుంటారు. అలాగే ఇంకొందరు వెంట్రులతో కార్లు, లారీలను లాగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ..
బంగ్లాదేశ్ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది.
పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఇటువంటి విపత్తులు ఏటా రాష్ట్రంలో సంభవిస్తున్నాయి.
ISS Captured Hurricane Beryl Visuals :తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఏర్పడిన భయంకరమైన హరికేన్ బెరిల్(Hurricane Beryl) అసాధారణ దృశ్యాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) చిత్రీకరించింది. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసిన వీడియో.. హరికేన్ పూర్తి పరిమాణం, తీవ్రతను స్పష్టంగా..