Home » Dasara
దసరా నవరాత్రుల వేళ.. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిమ్మల్ని మీరు నమ్ముండి.
దసరా చివరి రోజు దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా కైంకర్యాలను దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు. అందుకోసం దేవాదాయ శాఖతోపాటు నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టారు. ప్రతి ఏడాది దసరా చివరి రోజు... కృష్ణనదిలో అమ్మవారు జల విహారం చేస్తారు.
2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని ఆయన సందర్శించారు. ఆ క్రమంలో వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి ప్రధాని మోదీ కానుకగా అందజేశారన్నారు. శక్తి పీఠాల్లో ఒకటైన జేషోరేశ్వరి దేవాలయం.. సత్ఖిరాలోని ఈశ్వరీపూర్లో ఉంది.
దసరా పండగ వేళ.. భాగ్యనగరం నిర్మానుష్యంగా మారింది. పండగ కోసం నగర ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నగరంలోని రహదారులన్నీ బొసిపోయాయి. అలాగే నగరంలోని ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరుగుతున్నాయి. దసరా పండగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతోపాటు నగర జీవులు.. వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు.
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘మహాకనకదుర్గ..విజయకనకదుర్గ’గా అమ్మవారు భక్తుల కు దర్శనమిచ్చారు.
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు దుర్గాష్టమి. ఈ నేపథ్యంలో శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అయితే దసరా పండగ వేళ.. జమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు.
దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. దుర్ఘతలను పోగొట్టే దుర్గాదేవిని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు నగరానికి కొత్త ఆధ్యాత్మికశోభను తీసుకొ చ్చాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం అమ్మవారు వివిధ ఆలయాల్లో సరస్వతీదేవి అలంకా రంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా విజ యదుర్గా దేవి ఆలయంలో అమ్మవారు కాళరాత్రిదేవి అలంకా రంలో దర్శనమిచ్చారు.