Home » Defence Intelligence Agency
భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.
రక్షణశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్‌కు చెందిన ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు భారత్‌లోకి రావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. సొంత మనుషుల్లాగా చూసుకుంటామని ప్రకటించారు.
జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ ఆమోదం తెలిపారు.
చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో.. భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిస్సైల్స్‌ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.
దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది.