Home » Devotees
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఏ పండుగ జరిగినా, వేడుక నిర్వహించినా కూడా పలువురి ఫోటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టడం కామన్ అయిపోయింది. ఈ సందర్భంగా భక్తులకు స్వాగతం పలుకుతూ ఆయా చోట్లలో పలు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లలో మాత్రం ఒకటి జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ ఫ్లెక్సీ చిత్రాలలో అమెరికన్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా(Mia Khalifa) ఫోటో ఉంది.
హరియాలీ తీజ్ మహిళలు జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఈ రోజున వివాహం అయిన స్త్రీలు భర్త ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం దీక్షలో నీరు కూడా తాగకుండా సాయంత్రం వరకూ ఉంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడి ఆదాయంతో శిర్డీ సాయికి పోటీ ఏర్పడింది. గురుపూర్ణిమ సందర్భంగా జులై 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జరిగాయి. ఒక్క రోజే శిర్డీ సాయికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.
పురాతన ఆలయాలు, కట్టడాలు మన దేశ చరిత్రను, ఖ్యాతిని నలుదిశలూ వ్యాప్తి చేసే మూలాలు. ఈ సంపదను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావడం మన అందరి బాధ్యత.
విశాఖ: సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు భక్తులు పోటెత్తారు. ఆషాఢ శుద్ద చతుర్దసినాడు గిరి ప్రదర్శనను ప్రారంభించి పౌర్ణమినాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదర్శన చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
పండగల్లో తొలి ఏకాదశికి(Toli Ekadashi 2024) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది జులై 16న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఏకాదశి ఘడియలు జులై 17 బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు ముగుస్తాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారు 8వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగస్వామ్యులయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.