Home » Devotees
భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
విష, అమృత వలయాలు అంటే ఒకదాని నుంచి మరొక దానికి దారితీసే సంఘటనల సమూహాలు. ఇవి సుఖాన్ని లేదా దుఃఖాన్ని కలిగిస్తాయి.
ఇద్దరు వ్యక్తులు సముద్రంలో చిక్కుకున్నారు. తీరానికి కొంత దూరంగా ఉన్న ఒక రాతి మీదకు చేరుకున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి.
దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్యయోన దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి...
బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.
జులై 9న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి(Balkampet Yellamma Talli) కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఇవాళ(సోమవారం) మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. ఇవాళ పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్.ఆర్.నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్దఎత్తున కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు.
బోనాలు సమర్పించేందుకు భక్తులు వందలాది మంది ఇక్కడకు తరలివస్తారు. గోల్కొండ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ బోనాలు జరుగుతాయి.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.