Home » Devotional
తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ భక్తుల సౌకర్యం కోసం అమ్మవారి సేవలు ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చునని ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.
మన జీవిత పుస్తకంలో ‘చార్ధామ్’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్ధామ్’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి...
ఆ రాశి వారికి ఈ వారం ఆదాయం ఫుల్.. అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే...అపజయాలకు కుంగిపోవద్దని, ఆశావహదృక్పథంతో మెలగాలని సూచిస్తున్నారు. ఇంకా.. ఎవరెవరి రాశిఫలాలు ఈ వారం ఎలా ఉన్నాయంటే...
కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చోళ రాజులు వారసులుగా కార్వేటినగర సంస్థానాదీశులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సుమారు 300 ఏళ్ల క్రితం వారు తవ్వించిన అతి పెద్ద పుష్కరిణి ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండటం విశేషం.
ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా.. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారని, మొత్తానికి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...