Home » Devotional
రామాయణం మహర్షి వాల్మీకి రచించిన ప్రాచీనమైన పవిత్రమైన భారతీయ ఇతిహాసాలలో ఒకటి. ఈ మహాకావ్యం శ్రీరాముని ఆదర్శ జీవితం, ధర్మం, నైతికత మరియు సత్యపాలనను మహిమగా వివరిస్తుంది.
అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి.
కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నవంబర్ 20వ తేదీతో ముగుస్తోంది. ఆ మరునాడు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఈ పోలి పాడ్యమిని జరుపుకుంటారు.
కార్తీకమాసం హిందూ సంప్రదాయాలలో అత్యంత పుణ్యమాసంగా భావించబడుతుంది. ఈ పవిత్ర నెలలో భక్తులు శివబ్బావాని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శివారాధన వల్ల పాపక్షయము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే కాకుండా స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.
హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మండలపూజ, మకర విళక్కు మహోత్సవ సమయంలో లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలధారణతో శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అదంటంటే..
కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ.. ఈ మాసంలో వచ్చే కార్తీక మాస శివరాత్రి రోజు.. పరమశివుడిని ఇలా పూజిస్తే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు.
ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు... అయితే... కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే అవిశ్రాంతంగా శ్రమిస్తారని, మీ కృషి త్వరలో ఫలిస్తుందని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో గత 13 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఛండీ హోమాలు ఘనంగా నిర్వహించారు.
కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది శివుడు, విష్ణువులకు ప్రీతికరమైనది. అయితే, దీపాలు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలో మీకు తెలుసా?
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఇవాళ దేవుడి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు.