Home » Devotional
దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేసే సమయంలో కొందరు కొన్ని వస్తువులు పడేస్తుంటారు. అయితే ఈ వస్తువులు పడేస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది.
హిందూ వేద క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 27 (ఆదివారం)న ఉదయం 5.23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 28(సోమవారం)న ఉదయం 7:50 గంటలకు ముగుస్తుంది.
వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల వరస అజ్ఞానపు పొరలను తొలగించి విజ్ఞానపు వెలుగులను నింపుతుంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 31న దీపావళి పండగ జరగనుంది.
నిరాశకూ, అజ్ఞానానికీ చీకటి ప్రతీక అయితే దీపం ఆనందానికీ, ఉత్సాహానికీ, జ్ఞానానికీ చిహ్నం. చీకటిని తొలగించగల శక్తి ఒక్క దీపానికి మాత్రమే ఉంది. ఆ శక్తినే ‘పరమాత్మ అంటారు. ఆ పరమాత్మను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.
కార్తీక మాసం వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు అయ్యప్పమాల వేసుకుంటారు. అనంతరం వీరంతా శబరిమలకు పయనమవుతారు. అయితే ఇప్పటికే శబరిమలకు వెళ్లే రైళ్లన్ని రిజర్వేషన్లతో నిండిపోయాయి. భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వాటిలో సైతం రిజర్వేషన్లు అయిపోయాయి. అలాంటి వేళ.. ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చింది.
మహా నంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభ వంగా నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్క రించుకొని లోక కళ్యాణార్ధం మల్లికార్జున స్వామి, భ్రమ రాంబ అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహిం చింది.
లక్ష్మీ దేవితోపాటు కుబేరుడిని సైతం భక్తులు పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ధనత్రయోదశికి సైతం అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే దీపావళి రోజు కొన్ని యోగాలు ఏర్పడనున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి దశ తిరగనుంది.
పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుతూ ఈ రోజు వ్రతం ఆచరిస్తారు. పెళ్లయిన మహిళలు అయితే.. తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటూ ఈ నోము చేస్తారు. ఈ రోజు.. అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ క్రమంలో గౌరీదేవిని పూజిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించిందని పురాణాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం కుజుడు.. కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ మరునాడే అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6.49 గంటలకు చంద్రుడు సైతం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కర్కాటక రాశిలో అంగారకుడు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల మహాలక్ష్మి యోగం కలగనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి శుభప్రదం అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.