Home » Dharmavaram
పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ప్రియాంకనగర్‌లో పుట్టపర్తి రహదారి పక్కనగల కాంప్లెక్స్‌లోని నాలుగు దుకాణాల్లో చోరీ చేశారు. షట్టర్లను ఇరువైపులా వంచి, తాళాలను పక్కకు జరిపి లోపలకు చొరబడ్డారు.
పట్టణ పరిధిలో మహిళా పారిశ్రామిక వాడ, స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్.. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవితకు విజ్ఞప్తిచేశారు.
రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని పుట్టపర్తి జూనియర్ సివిల్ నాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్‌సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి రాకేష్ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు.
పులివెందుల బ్రాంచ కెనాల్‌కు ఎగువ భాగంలో ఉన్న దేశాయి సింగప్పకుంటకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు.
జిల్లాలోని ప్రతి పోస్టాఫీసులో 11, 12 తేదీలలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స, రూరల్ పోస్టల్ లైఫ్ఇన్సూరెన్సపై ప్రత్యేక మేళాను నిర్వహిస్తున్నట్లు హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ తెలిపారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచిమార్గంలో నడిపించాలని 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు, పాఠశాల హెచఎం నాగప్ప అన్నారు.
అంగనవాడీ కేంద్రాల్లో మెడికల్ కిట్ల కొరత వేధిస్తోంది. కేంద్రంలో దెబ్బలు తగిలినా, జలుబు, జ్వరం, దగ్గు వంటివి సొకినా చిన్నారులను ఇంటికి పంపుతున్నామని, నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని అంగనవాడీ కార్యకర్తలు వాపోతున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో నీరు లేక నిర్జీవంగా మారిన కుంటకు పీబీసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ గ్రామస్థులు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కోరారు.
ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందాలని ఆర్డీఓ మహేశ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.