Home » Districts
జిల్లాలోని 28 మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 148.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె మండలంలో 75.8, రాయదుర్గం 75.6, పామిడి 62.2, డి. హీరేహాళ్ 59.8, బెళుగుప్ప 56.2, విడపనకల్లు 54.6, కణేకల్లు 54.0, కళ్యాణదుర్గం 50.4, శింగనమల 48.6, పెద్దవడుగూరు 40.6, గుమ్మఘట్ట 36.2, ...
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారికి ఆనలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారులకు శనివారం సర్వర్ సమస్య తలెత్తింది. ఆనలైనలో వివరాలను నమోదు చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా నాన రీఫండబుల్ రుసుం చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యం కాలేదు. దీంతో వ్యాపారులు ...
కలెక్టరేట్ సమీపంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం కబ్జాకు గురవుతోంది. నగరంలోకి ప్రవేశించే కదిరి బైపాస్, జేఎనటీయూ రోడ్డు కలిసే వై జంక్షనలో ఉన్న కార్యాలయం కనిపించకుండా కొందరు పాగావేశారు. కార్యాలయం ముందు దుకాణాలను ఏర్పాటు చేసి.. రోడ్డు వరకు విస్తరించారు. దీంతో కార్యాలయ బోర్డు, ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం కనుమరుగయ్యాయి. వైసీపీ హ యాంలో ఈ కబ్జాల పర్వం
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్, కేబుల్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం ...
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విశ్రాంత అధికారి అక్రమ వ్యవహారాలకు అడ్డేలేకుండా పోయింది. కూట మి అధికారంలోకి వచ్చాక విశ్రాంత తహసీల్దార్లు ఎక్కడా పనిచేయకూడదని ఆదేశించింది. ఎక్కడైనా పనిచేస్తుంటే వెంటనే తొలగించాలని మూడు నెలల క్రితం ఆదేశించింది. దాదాపు జిల్లా అంతటా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశారు. కానీ భూగర్భగనుల శాఖలో మాత్రం అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో మైన్స అక్రమార్కులకు సహకరించిన ఓ ...
ఖరీ్ఫలో వేరుశనగ సాగు చేసిన రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల్లో పదును వర్షం కురవకపోతే పశుగ్రాసం కూడా దక్కదని అంటున్నారు. రాప్తాడు మండల వ్యాప్తంగా 33 వేల ఎకరాల సాగు భూమి ఉంది. జూన, జూలైలో కురిసిన వర్షాలకు, బోరు బావుల కింద 4,350 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాధారం కింద సాగు ...
‘శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అవుతుంది’ అని హైకోర్టు జడ్జి, అనంతపురం పోర్టు పోలియో జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం ఈ-కోర్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ శ్యాంసుందర్, జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్, విశ్రాంత న్యాయాధికారి హజరతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోను, న్యాయమూర్తిగానూ రాణించాలంటే ...
మహిళల పొదుపు సొమ్మును వైసీపీ హయాంలో దిగమింగారు. ఐదేళ్లలో రూ.కోట్ల నిధులు స్వాహా చేశారు. అక్కాచెల్లెమ్మల సొమ్ముకు రక్షణగా నిలవాల్సిన డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులలో కొందరు ఈ అక్రమాలలో సూత్రధారులు, పాత్రధారులుగా మారారు. కళ్యాణదుర్గం, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినవారిపై డీఆర్డీఏ-వెలుగు అధికారులు...
ఆ స్టేషన సిబ్బందిలో కొందరు విధి నిర్వహణ కంటే కాసుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్యూటీ దిగేలోగా జేబులు నింపుకుంటున్నారు. ప్రతి రోజు టార్గెట్ పెట్టుకుని మరీ దందాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆదాయ వనరును ఎంచుకుని, అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు ఇసుక మాఫియాతో మిలాఖత అయ్యారు. మరికొందరు ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని పట్టుకోవడం.. సెల్ఫోనలు లాక్కోవడం, బెదిరించి ...
పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం చెరువుకు నీరు తరలించే కుడికాలువ నిర్వహణను వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండింది. చూడటానికి చిట్టడవిని తలపిస్తుంది. దాదాపు 112 కి.మీ. పొడవు ఉన్న ఈ కాలువ మరమ్మతులకు గడిచిన ఐదేళ్లలో పైసా ఇవ్వలేదు. ప్రతి ఏటా నిధుల కోసం అధికారులు నివేదికలు పంపడం.. అవి బుట్టదాఖలు కావడంతోనే ఐదేళ్లు గడిచిపోయింది. కాలువకు ఇరువైపులా కంపచెట్లు పెరిగినందున నీరు వదిలితే గండ్లు పడే ప్రమాదం ఉంది. కూడేరు ...