Home » DK Shivakumar
వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్ఎస్ జలాశయాన్ని డీకే సందర్శించారు.
కర్ణాటక కోటా బిల్లు తీవ్ర దుమారం రేపతోంది. ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీస్‌లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది. ఆ బిల్లుపై ఇంటా బయటా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూర్‌లో ఉండే స్థానికేతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ పే కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు.
అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువసీట్లు సాధించడంపై అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని పంపింది. పార్టీ సీనియర్ నేత మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ బెంగళూరుకు వచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన వాటి కంటే తక్కువ స్థానాలు దక్కడంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామని కేపీసీసీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరెంత కాలం ప్రాణం ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) ఎద్దేవా చేశారు. ప్యాలెస్ మైదానంలో బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాపాలలో మునిగిపోయిందని విమర్శించారు.
సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అంతా సమైక్యంగా ఉన్నామనేలా కనిపించిన కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరికివారుగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.