Home » DK Shivakumar
సీఎం పదవి కోసం డీకే శివకుమార్(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ల వెనుక ఉన్నది కుమారస్వామేనని, వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడంలో ఆయన కింగ్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది..
కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నకిలీ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నలుగుతున్న మూడు స్థానాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికీ పెండింగ్లో పెట్టింది. ఆయా స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు.
తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
ఖమ్మం లోక్సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.
‘మిస్టర్ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar సవాల్ విసిరారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. చామరాజనగర్ లోక్ సభ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ పరిధిలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధృవ నారాయణ చామరాజనగర్ నుంచి కేవలం 1817 ఓట్లతో ఓడిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను 48 వేల ఓట్లతో విజయం సాధించానని సిద్దరామయ్య గుర్తుచేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్(Congress MP DK Suresh) ఆస్తులు రూ.593 కోట్లుగా చూపారు. ఐదేళ్ళ వ్యవధిలో ఆయన ఆస్తి అక్షరాల రూ.259 కోట్లు పెరిగింది.