Home » DK Shivakumar
తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
ఖమ్మం లోక్సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.
‘మిస్టర్ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar సవాల్ విసిరారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. చామరాజనగర్ లోక్ సభ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ పరిధిలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధృవ నారాయణ చామరాజనగర్ నుంచి కేవలం 1817 ఓట్లతో ఓడిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను 48 వేల ఓట్లతో విజయం సాధించానని సిద్దరామయ్య గుర్తుచేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్(Congress MP DK Suresh) ఆస్తులు రూ.593 కోట్లుగా చూపారు. ఐదేళ్ళ వ్యవధిలో ఆయన ఆస్తి అక్షరాల రూ.259 కోట్లు పెరిగింది.
మల్లికార్జున్ ఖర్గే అంటే భయం కారణంగానే ఆయన సొంత జిల్లా కులబురగి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని, కలబురగి సహా రాష్ట్రంలో 20 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.
బెంగళూరులోని ఓ హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar)ని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరో బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిశారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవ్వరు ఎంపీగా పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్(Congress) పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా రాష్ట్రం నుంచి ఏడుగురికి చోటు దక్కింది.
కర్ణాటక కాంగ్రెస్లో(Congress) ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో కర్ణాటకలోనూ అత్యధిక ఎంపీ స్థానాల్లో పాగా వేస్తామని అప్పట్లో నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలెవరూ పోటీ చేయడానికి ముందడుగు వేయట్లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.