Home » DMK
ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు మంత్రి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, దివంగత కరుణానిధి మనమడు అనే సంగతి తెలిసిందే. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషిచేశారు. దాంతో మంత్రివర్గంలో ఉదయనిధికి చోటు దక్కింది .
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనతో తమిళులకు సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) మీడియా ఎదుట బహిరంగ క్షమాపణ చెబితే మన్నిస్తామని రాష్ట్రప్రభుత్వం(State Govt) హైకోర్టుకు స్పష్టం చేసింది.
తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఎట్టకేలకు స్పందించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిఫార్సులు వస్తున్న మాట వాస్తవమేనని, కానీ అవేవీ ఫలించలేదని సరదాగా వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మం పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంలో డీఎంకే నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, తాజాగా మరో డీఎంకే మంత్రి ఎస్.ఎస్.శివశంకర్ నోరు పారేసుకున్నారు. అసలు రాముడి ఉనికే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు వ్యాప్తంగా శనివారం ధర్నాలు జరిగాయి. బడ్జెట్లో రాష్ట్రానికంటూ ఎలాంటి కొత్త పథకాల ప్రస్తావనలుగానీ, రెండో దశ మెట్రోరైలు వంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులుగానీ లేకపోవటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్-2024లో ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల విపక్ష చూపించారంటూ విపక్షాల విమర్శల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపితే ఒంటరిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలపై ఆయన శనివారం స్పందించారు. ''డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే'' అని నవ్వుతూ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వేడుకల సందర్భంగా రూ.100 విలువైన స్మారక నాణేలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు.