Home » DMK
కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురం కల్తీసారా మృతుల సంఖ్య శుక్రవారం 52కు పెరిగింది. మరో 112 మంది బాధితులు పుదుచ్చేరి, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) ప్రభుత్వంలో అసమ్మతి రేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నమశ్శివాయం పరాజయం ఈ కూటమిలో చిచ్చు రేపుతోంది.
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) జోస్యం చెప్పారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్, సౌత్ చెన్నై లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు.
మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది.
తమిళనాడులో 'ఇండియా' కూటమి 'క్లీన్ స్వీప్' సాధించడం ఖాయమని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారంనాడు పోలింగ్ జరుగుతోంది.
తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో