Home » Doctor
వాంతులు, విరేచనాలతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించిన ఇద్దరు విద్యార్థులకు చికిత్స చేసేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. కారణం.. ఆస్పత్రిలో పన్నెండేళ్ల లోపు పిల్లలకే వైద్యం చేస్తామని, బాధిత విద్యార్థుల వయసు 13 ఏళ్లు అని.. నిబంధనల ప్రకారం వారికి నిలోఫర్‌లో చికిత్స చేయడం కుదరదని తేల్చేశారు.
బేగంపేటలోని కిమ్స్- సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. ‘పుష్ప’ సినిమా చూపిస్తూ సర్జరీ చేసి రోగి మెదడులో కణతిని తొలగించారు. నిజామాబాద్‌కు చెందిన సి.బి ప్రతిప్(30) కొనేళ్లుగా బహరేన్‌కు(అరబ్ దేశం)లో ఉద్యోగం చేస్తున్నారు.
పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రంలో త్వరలో ఎక్స్‌రే సేవలందిస్తామని హాస్పిటల్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా తెలిపారు.
పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాని(సీహెచసీ)కి వైద్యులు రాం.. రాం.. అంటున్నారు. వచ్చి విధుల్లో చేరిన రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోతారు. సెలవు పెట్టరు.. రాజీనామా చేయరు. మొత్తం 8 మంది వైద్యులకుగాను ముగ్గురే పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీహెచసీలో వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. చేసేదిలేక జబ్బుల బారిన పడినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పట్టణాలకు వెళ్తున్నారు. వెరసి ప్రయాణ, వైద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సీహెచసీ 24 గంటలు ...
ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్‌ఫుడ్(Jobs, Fast Food), మానసిక ఒత్తిడిలు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడం, వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు.
తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యుడిని కత్తితో పొడిచిన నిందితుడిని ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని చితకబాదారు.
న్యూమోనియా(Pneumonia)తో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చలికాలంలో వైద్యుల సలహాలు పాటించాలని మెడికవర్ ఆస్పత్రి పల్మనాలజిస్టు డాక్టర్ రాజమనోహర్ ఆచార్యులు(Dr. Rajamanohar Acharya) తెలిపారు. ప్రపంచ న్యుమోనియా డే సందర్భంగా ప్రతి ఏడాది కొత్త నినాదంతో కార్యక్రమాలు చేపుడుతన్నామని మాదాపూర్(Madapur)లోని మెడికవర్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న వివరించారు.
అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి సురక్షితమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉన్నారు! గ్రామాల్లో సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఎంబీబీఎస్, బీఎంఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించింది.
కారు డ్రైవింగ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ సమీపంలో జరిగింది.
శరీరంలో వాపులను తగ్గించే స్టిరాయిడ్ ఔషధాల వాడకం రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్దకు వస్తున్న పేదసాదలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు చేసేస్తున్నారు.