Home » Donald Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో కేసులో ఊహించని షాక్ తగిలింది. కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అక్షరాల $354.9 మిలియన్ (మన ఇండియన్ కరెన్సీలో రూ.3వేల కోట్లకు పైనే) జరిమానా చెల్లించాలని న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. రచయిత జీన్ కారోల్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో.. ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692 కోట్లు పైనే) చెల్లించాలని న్యూయార్క్‌లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా మరోసారి పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం దక్కింది. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. అత్యంత కీలకమైన న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు.
భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ప్రక్రియలో పేలవ రీతిలో వెనుకబడడంతో రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు న్యూయార్క్ సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ న్యూయార్క్ టైమ్స్, దాని విలేఖరులకు 400,000 డాలర్లు (రూ.3,31,48,940) చెల్లించాలని ఆదేశించింది.
విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటుంటారు. మరికొందరు ...
అమెరికాలో పేరు మోసిన లైంగిక నేరస్థుడు ‘జెఫ్రీ ఎప్‌స్టెయిన్’ (Jeffrey Epstein Files) కోర్టుకు తెలియజేసిన సమాచారంలో తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన పత్రాలను న్యూయార్క్ జడ్జి తెరవడంతో అమెరికాకు చెందిన పలువురు హైప్రొఫైల్ వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి.
క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను వేటాడుతోంది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు భారీ షాక్ తగిలింది. మరోసారి అధ్యక్ష బరిలోకి దిగాలనుకున్న ఆయన కలలకు బ్రేక్ వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు(America President Elections) 2024లో జరగనుండగా వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal) ప్రచురించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.