Home » Droupadi Murmu
తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.
నేర తీవ్రత, దానిని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పని ప్రాంతాల్లో భయాలు నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యావద్దేశం నిష్పాక్షికమైన సత్వర విచారణను కోరుతోందని వైద్యులు తమ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
హైదరాబాద్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నందవరం మృదుల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు.మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు.
భారతదేశ 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 140 కోట్ల ప్రజానీకం ఎంతో సంబరంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతోందని అన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్వర్క్ దూరదర్శన్లోని అన్ని ఛానెల్‌లలో హిందీలో ఆపై ఇంగ్లీష్ వెర్షన్లో ప్రసారం చేయబడుతుంది.
కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సరికొత్తగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో బుధవారం సాయంత్రం స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్(34)తో ద్రౌపది ముర్ము (66)సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో(Hatras) జరిగిన తొక్కిసలాటలో(Hathras Stampede) మృతి చెందిన వారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సంతాపం తెలిపారు.
దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.