Home » Drugs Case
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్(Nigerian)తోపాటు ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ), బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ కార్యాలయం(CCS Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి(CP K. Srinivas Reddy) కేసు వివరాలను వెల్లడించారు.
నగరంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్స్, చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ చోరీలు, దొంగతనాలు సహా పలు నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రాజేంద్రనగర్‌లో ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పెద్దమొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో 256గ్రాముల మల్టీ పుల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
డ్రగ్ ఫెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్‌తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సోమవారం నాడు మస్తాన్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో డ్రగ్ సప్లై, కస్టమర్లు వ్యవహారంపై ఆరా తీశారు. ఈ టైమ్‌లోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వెలుగుచూశాయి...
Andhrapradesh: గుంటూరులో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. మస్తానయ్య దర్గా ధర్తకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు రావి మస్తాన్ సాయిని సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయితో కలసి సుబానీ హోటల్ నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసులో సుభానీ హోటల్ యజమాని ఇద్దరు కొడుకులు నాగూర్ షరీఫ్ , ఖాజా మొయినుద్దీన్‌లు అరెస్టు అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఇతను డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓవైపు లావణ్య కేసులో.. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ పేరు మార్మోగింది. ఈ క్రమంలోనే నిందితుడిని గాలించిన ఏపీ పోలీసులు సోమవారం నాడు గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు..
పోలీసు నిఘా పెరగడం వల్ల బహిరంగ మార్కెట్లో మత్తుపదార్థాలు చేతులు మారే పరిస్థితి లేకపోవడంతో ముఠాలు డార్క్వెబ్ను అడ్డాగా మార్చుకుంటున్నాయి.
పద్ధతిగా సేద్యం చేసుకుంటూ, పాలు అమ్ముకుంటూ బతికేవారు. జల్సాలకు ఆ సొమ్ము సరిపోలేదని మొదట కర్ణాటక మద్యం అమ్మారు. ఆ తరువా గంజాయి వ్యాపారంలోకి దిగారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పామిడి పోలీసు స్టేషనలో సీఐ రాజశేఖర్‌రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. పామిడి మండలంలోని పాళ్యం గ్రామానికి చెందిన అన్నదమ్ములు తమ్మినేని శివకుమార్, తమ్మినేని నందకుమార్ పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఆవులను పెంచుతూ పాలను అమ్మేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, జల్సాలకు ...
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్ బ్యూరో(Bureau of Narcotics) అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.