Home » Duddilla Sridhar Babu
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఫ్రెంచ్ ఏరోస్పేస్ పరిశ్రమల సంఘం ప్రశంసించింది. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేసింది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అమెరికా ప్రధాన కేంద్రంగా 141 దేశాల్లో విస్తరించి.. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీగా ఉన్న మ్యారియట్.. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది.
ఫార్మా కంపెనీలకు వ్యాపార సహకారం అందించే ఆర్ఎక్స్ బెనిఫిట్స్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది.
పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని, పడగొట్టాలని కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరాబాద్‌ను వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువ ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతతో యూనికార్న్‌లుగా (బిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీ) ఎదగాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.