Home » East Godavari
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్‌లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు
నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.
దొంగతనం కేసులో రికవరీ చేసిన డబ్బు, బంగారంలో నొక్కుడు... పేకాట రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడితే వాటా... పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేయాలంటే లంచం...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 2019ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహించిన కోమసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు.
జిల్లాలోని పోలీసింగ్ పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. బాస్ సమర్థుడే అయినా సిబ్బంది హద్దులు మీరడం.. కేసులను తారుమారు చేయడం.. గంజాయి పల్లెలకూ పాకిన దౌర్భాగ్యం వెరసి జిల్లా పోలీసు శాఖపై ఆరోపణలు అలముకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దాష్టీకాలు జరిగినా లాఠీ బయటకు తీయలేదు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు మండలం కాపవరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తొలి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం విజయవాడ కారులో బయలుదేరుతూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించేశారు.
రాజమహేంద్రవరం, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి): ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను రాష్ట్రం లో నెంబర్‌వన్ చేయడమే లక్ష్యమని, గత ఐదేళ్ల లో వైసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన నామినేటెడ్ పాలకవర్గం బ్యాంక్‌ను దివాళా వైపు నడిపించిం దని, డిపాజిట్ల సేకరణ లేదని, అప్పులు కూడా వసూలు చేయలేదని, అవ
కా..ఫీ.. అంటే కాస్త ఫీలింగ్. ఉదయాన్నే పొగలు కక్కే చిక్కటి కాఫీ రుచి చూడనిదే చాలామందికి రోజు ఆరంభమేకాదు. కాఫీ గొంతులో పడనిదే మంచం దిగని వారెందరో. ఇదేంటి పొద్దున్నే అన్నామనుకోండి.. బెడ్ కాఫీ మహిమ మీకేం తెలుసంటారు. రీఫ్రెష్ అవ్వాలంటే కాఫీ ఒక్కటే మందు అని వాదించే కాఫీ క్లబ్ బ్యాచ్‌లూ ఉన్నాయి. ఇదివరకు కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ ఒక్కటే. అంత సమయం లేదండీ.. అనుకునే వాళ్లంతా ఇన్స్టెంట్ కాఫీ రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ కాఫీలు ఓల్డ్. ట్రెండ్‌కు అనుగుణంగా కాఫీ రకాలెన్నో వచ్చేశాయి. బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, చాక్లెట్ కాఫీ.. ఇంకా చాలా ఉన్నాయ్. ఓసారి కాఫీడేకో, మరో కాఫీషాప్‌కో వెళితే ఇవన్నీ కాఫీలేనా అని ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది.. నేడు కాఫీ డే సందర్భంగా ఒక్కసారి ఆ కాఫీ రుచి చూసేద్దాం.. కాస్త.. ఫీలింగ్ ఆస్వాదిద్దాం!
ఆనందంలో మునిగితేలుతున్న ఆ క్షణాలు.. వారికి చివరి క్షణాలయ్యాయి. వైద్య విద్యతో ఒకరికి ప్రాణదానం చేయాల్సిన వీరిని మృత్యువు.. క్షణాల్లో విగతజీవులుగా మార్చేసింది. నిజానికి ప్రకృతి సోయగాలకు అసలైన అందం జలపాతాలే. కొండకోనల్లోంచి పొంగిపొర్లుకుంటూ వాగుల్లోకి వచ్చే దృశ్యాలను వీక్షించేవారు కొందరైతే, పచ్చని ప్రకృతి ఒడిలోంచి వడివడిగా వస్తున్న ఆ చల్లని జలాల్లో ఈదులాడాలని ఉరకలెత్తేవారు కొందరు. ఆ తహతహే కొందరిని మృత్యువు తన ఒడిలోకి లాగేసుకుంటోంది.
యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.