Home » East Godavari
రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కైలాసలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన కేసులో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పాస్టర్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో శనివారం రోజున పాచిపోయిన బిర్యానీ పెట్టడంతో సుమారు 38మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
జల్సాలకు అలవాటుపడి ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన నిందితుడు వెంకటేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. ఎస్పీ నర్సింహ కిశోర్ కేసు వివరాలను వెల్లడించారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.
కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఓ చెట్టు ఉంది. దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చెట్టుకు ఓ పేరు ఉంది. అదే సినీ వృక్షం, వయస్సు 150సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆ చెట్టు ఎందుకంత ప్రత్యేకమో.
Andhrapradesh: జిల్లాలోని పి.గన్నవరం ఊడిమూడి వద్ద పడవ ప్రమాదంలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. చదలవాడ విజయ్ కృష్ణ (26) మృతదేహాన్ని స్థానికులు వెలికి తీశారు. ఈనెల 28వ తేదీన ఊడిమూడిలంక వరద బాధితులకు వాటర్ ప్యాకెట్లు బస్తాలు తీసుకువెళ్తున్న నాటుపడవ గోదావరిలో మునిగిపోయింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న విజయ్ కృష్ణ గల్లంతయ్యాడు. గత మూడు రోజులుగా విజయ్ కోసం గాలించగా...
తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అన్నారు.
గండేపల్లి మండలం మురారి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Andhrapradesh: సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ...హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు.
Andhrapradesh: బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్‌డీఎస్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు.