Home » East Godavari
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dowleswaram Barrage) ఒకటో నంబర్ గేటు వద్ద ప్రవాహానికి అడ్డంగా నాటుపడవ ఇరుక్కుపోయింది. దీన్ని బయటకు తీసేందుకు 24 గంటలుగా అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.
ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఎంతో మంది తెలుగువాళ్లు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కువైట్లో చిక్కుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు లోకేష్ తీవ్రంగా కృషి చేశారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తింది.
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.
కాకినాడ జిల్లా: సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ, చిత్రాడకు చెందిన అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ విద్యార్థినిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు.
Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.
Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
Andhrapradesh: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కోసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు.