Home » Education
విద్యారంగ సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి... విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ డి మాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో విద్యార్థులు బుధవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నగరంలో భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ మేరకు మున్సిపల్ టీచర్ల పదోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ నా యకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్బాబును ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు మాట్లా డుతూ... మున్సిపల్, నగర పాలక ఉపాధ్యాయుల పదోన్నతులు షెడ్యూల్ మేరకు చేపట్టాలన్నారు.
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల అయింది. 2025 ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ఫస్ట్ & సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ తేదీల్లో ఫీజు చెల్లించవచ్చు.
Supreme Court of India: మదర్సాల విషయంలో మంగళవారం నాడు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మదర్సాల నిర్వహణకు సంబంధించి ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యూకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును..
TET Notification 2024: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు.
తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు.
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 30వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసీఏఐ వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి లాగిన్ కావాల్సి ఉందని వివరించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించిన విషయం విధితమే.
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలను గతంలో కన్నా నెల రోజుల ముందుగానే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
అపార్లో తప్పులు లేకుండా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.