Home » Education
పీవో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి..
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నీకోలస్ తెలిపారు.
IGI ఏవియేషన్ సర్వీసెస్ 1400 కి పైగా ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు పొందాలంటే కేవలం టెన్త్ పాసైతే చాలు. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే త్వరపడండి. వయోపరిమితి, జీతం, తదితర పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
తెలంగాణలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ఛాన్సలర్ అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని చౌహాన్ పేర్కొన్నారు.
గేట్ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. ఐఐటీలతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు, పీహెచ్‌డీలో ప్రవేశాలకు..
బిహార్ స్థానికులకు టీచర్ల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా సంబంధింత నిబంధనల్లో మార్పు చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు ఇచ్చామనీ, సవరించిన నిబంధనలు టీఆర్ఈ-4 నుంచి వర్తిస్తాయని నితీష్ కుమార్ తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ తన స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియలో ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది. కాబట్టి, అమెరికా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులు ఈ 3 కీలక మార్పులు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం..
భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఏకంగా పదివేలకుపైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
CAT 2025 కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? నోటిఫికేషన్, పరీక్ష తేదీలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..