Home » Election Commission
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ జిష్టుదేవ్వర్మ ఆమోదం తెలిపారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర బీజేపీ విభాగం కోరింది. సుదీర్ఘ వారంతపు సెలవుల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నందున పోలింగ్ తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.
గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై స్పష్టత లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించింది.
Andhrapradesh: ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఈరోజు (సోమవారం) నుంచి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు.
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వెల్లడించింది.
పోలింగ్ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది.
ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ హెచ్చరించారు. 2024 పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన మొదటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు.