Home » Election Commission
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది.
ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ హెచ్చరించారు. 2024 పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన మొదటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు.
టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం దాఖలు చేసిన సి.రామచంద్రయ్య (Ramachandraiah), పి.హరిప్రసాద్ (Hariprasad,) నామినేషన్లను ఎన్నికల సంఘం(Election Commission) ఆమోదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక(MLC by-elections)కు జారీ చేసిన నోటిఫికేషన్కు ఇప్పటివరకూ రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలు పెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
ఇంకొన్ని గంటల్లో ఈవీఎంల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సంపద సర్వే, ఆస్తుల పునఃపంపిణీ చుట్టూనే వాదం, వివాదం, సవాళ్ల పర్వం సాగింది.
లోక్సభ ఎన్నికల అనంతరం 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్షా ఫోన్ చేసి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యల వ్యవహారం ముదురుతోంది. దీనిపై ఈసీ సోమవారంనాడు జైరామ్ రమేష్కు అల్టిమేటం ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర హోం మంత్రి అమిత్షా దేశవ్యాప్తంగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు ఫోన్ చేసి వారిని ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఘాటుగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేయడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం సరికాదని అన్నారు.