Home » Election Results
చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎనిమిది చెల్లిన ఓట్లు ఉన్నాయని, కాబట్టి మళ్లీ లెక్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్తాన్ ఎన్నికల సమయంలో జరిగిన రిగ్గింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్‌కు అనుకూలంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు.
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో గల కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అధిక్యంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్‌కుగానూ ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయిన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడిప్పుడే సౌండ్ పెంచుతున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఎంపీ సీట్ల కేటాయింపు అంశంపై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
Telangana Election Results : తెలంగాణ హస్త ‘గతం’ అయ్యింది.. కౌంటింగ్ ప్రారంభమైన 8 గంటల సమయం నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగిందనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడొచ్చు..
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది.
రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఏఐసీసీ ఢిల్లీ అగ్ర నేతలు రానున్నారు.