Home » Eluru
తాము చనిపోతాం.. అనుమతి ఇవ్వాలని ఏలూరులో కలెక్టర్‌ను కలిసి వృద్ధ దంపతులు కోరారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పని చేసే అవుట్ సో ర్సింగ్ ఉద్యోగి ఒక అనాథ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు.
ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.
చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 వ రోజు గురువారం చిన వెంకన్న మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
జిల్లాలో ఏలూరు నగరంతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మాత్రమే కొద్దిపాటి పెద్ద సెంటర్లు, మిగతా అంతా గ్రామీణ ప్రాంతమే. వ్యవసాయాధారిత గ్రామాల్లో కూలీలు, చిన్న వ్యాపారుల లక్ష్యంగా కాలనీ గ్యాంగ్‌లు అప్పులు ఇచ్చి మరీ వేధిస్తున్నారు.
Andhrapradesh: దీన్ని ఆసరాగా తీసుకుని ఓ ముఠా పెద్ద ప్లానే వేసింది. మ్యాట్రామోని డాట్.కామ్‌లో పెళ్లి కాని వారే వీరి టార్గెట్. పెళ్లికాని వారి డీటెయిల్స్ తీసుకుని వారికి కళ్లబొల్లి మాటలు చెబుతూ సంబంధాలు కుదుర్చుకుని.. వివాహం అయిన తర్వాత తమకు ...
సాధారణంగా చికెన్ బిర్యానీ ధరెంత ఉంటుంది. ఒకరు కడుపునిండా తినాలంటే రూ.100కుపైగా చెల్లించాల్సిందే. మరి రూ.3 బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా. లేదా.. అయితే ఈ వార్త మీకోసమే. కానీ ఓ ట్విస్ట్ ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు స్పందించారు. దీనికి కారణమైన వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టాలని.. ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నారాయణపురానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కాశీలోని తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను లక్ష్మీనారాయణ, వినోద్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ క్రికెట్ బెట్టింగ్‌లు చేస్తుండేవారు.