Home » Employees
తెలంగాణ టీడీపీ కడప మహానాడులో యువతకు ఉపాధి, మహిళా సాధికారత వంటి నాలుగు కీలక తీర్మానాలు తీసుకుంది. రాష్ట్రం నుంచి 1500 మంది ప్రతినిధులు ఈ మహానాడుకు హాజరయ్యారు.
గ్రీస్‌లో డాట్ నెట్, ఎంఎస్ ఎస్ క్యుఎల్ డెవలపర్లకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించబడుతున్నాయి. ఎంపికైనవారికి రూ.25.2 లక్షల వేతనం, ఉచిత నివాసం, భద్రతా ప్రయోజనాలు ఉంటాయి.
ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకానికి ఒక్క శాతం లేదా ఒకటిన్నర శాతం వేతనాన్ని అందించాలనే రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగ సంఘాలు మాత్రం ఒక శాతానికి మించి చెల్లించలేమని స్పష్టంచేస్తున్నాయి.
టీచర్ల బదిలీలకు ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది.విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారం డీఈవోలకు వెబెక్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఉద్యోగులకు ఇదిఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్థం ప్రభుత్వం పలు రాయితీలు కల్పించడంతోపాటు, ప్రమాదంలో మరణించినా, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి అందేలా ఉచిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది.
వ్యవసాయశాఖ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు. బదిలీల్లో తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 32,271 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో 35,371 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు ప్రకటించాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్ ఈ మేరకు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు.
2017 తర్వాత రాష్ట్ర ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఖాళీల సమస్య పెరిగిపోతున్నట్లు సమాచారమొచ్చింది. యువత ఇటీవలి ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యపై సీరియస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.