Home » Encounter
ఛత్తీ్‌సగఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి ఎర్రబారింది. శుక్రవారం నారాయణపూర్- దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. దాంతో మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టమైంది.
జమ్మూ కశ్మీర్ మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అందులోభాగంగా జమ్మూలోని ఎమ్ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఈ విడతలో జమ్మూ డివిజన్లో మిగిలిన 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు.
జమ్ము, కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది
కథువా-బసంత్‌గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని చెప్పారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా సింగిల్ జడ్జి స్టే విధించారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.
మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్‌గా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని ఛత్తీస్గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం.