Home » Enforcement Directorate
Telangana: భూదాన్ భూమి అన్యాక్రాంతం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతిని విచారించిన ఈడీ.. తాజాగా ఆర్డీవో వెంకటాచారిని విచారిస్తోంది. ఈ భూమి విషయంలో అధికారులు కోట్లు పొందారని ఈడీ అనుమానిస్తోంది.
భూ బదలాయింపుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఎమ్మార్వో జ్యోతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా భూ బదలాయింపుల కేసులో అవసరమైన ఒక్కొక్కరికి ఈడీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది.
భూ ఆక్రమణల బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది.
వందల కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపై మాజీ కలెక్టర్, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో రోజు గురువారం విచారించనుంది.
మాజీ కలెక్టర్, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు.
Telangana: భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈడీ ముందు విచారణకు వచ్చారు. బుధవారం ఉదయం సదరు ఐఏఎస్ అధికారి తన న్యాయవాదతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
విశాఖ లాసన్స్బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.