Home » Enforcement Directorate
పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది.
రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్టు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారం ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఢిల్లీ వక్స్ బోర్డ్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా(Bhupendra Singh Hooda)కు సంబంధించిన భూ కుంభకోణంలో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. హుడా తదితరులపై మనీలాండరింగ్ కేసులో రూ.834 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ బుధవారం నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధ్రువీకరించింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈడీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారని తెలిపింది.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహం మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవోలు)కు శాపంగా మారింది.