Home » Exams
అసోం రాష్ట్రంలో ‘క్యాష్ ఫర్ మార్క్స్’ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మార్కులు పెంచడం కోసం యూనివర్సిటీ సిబ్బంది నగదు తీసుకున్నట్లు బయటపడింది.
నీట్-యూజీని పెన్ను-పేపరు విధానానికి బదులు ఇక ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం (జూన్ 28) రాత్రి UGC-NET, CSIR-NET NCET కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. జూన్ 18న జరిగిన ఈ పరీక్ష రద్దు చేయబడింది. ఇప్పుడు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య మళ్లీ నిర్వహించనున్నారు.
ప్పుడెప్పుడా అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ‘
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుర్రా వెంకటేశం సోమవారం విడుదల చేశారు. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో ఏడాదిలో 43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గ్రేస్ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.