Home » Farmers
తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు, విస్తరణ పెరుగుతుందని ఆయన చెప్పారు.
వరదలు ముంచెత్తిన నష్టంతో విలవిలలాడిన రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు మరో సారి నిండా ముంచిందని, అది పరిహారం కాదు.. పరిహాసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ నుంచి శనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో నిల్వ ఉన్న 25 వేల క్వింటాళ్ల శనగ విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు ఎగుమతి చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే రైతుల ఖాతాల్లో రూ. 25 వేల కోట్లు జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం. కోదండరెడ్డి తెలిపారు.
వారం, పది రోజుల్లో అర్హులైన మిగతా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రూ.79.57కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
సన్నధాన్యంపై క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఎలా జమ చేయాలన్న అంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది.
‘‘గత పదేళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు.. మేము చేస్తున తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు.
మండలంలోని యల్లటూరు రాజీవ్‌నగర్‌కు చెందిన పార్ల పుల్లారెడ్డి (57) అనే రైతు సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.