Home » Fire Accident
తూర్పు ఢిల్లీ వివేక్ విహార్‌లో నవజాత శిశువు సంరక్షణ ఆసుపత్రిలో శనివారం అర్థరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు.
గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire) లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా మృతుల సంఖ్య 33కి చేరింది. ఈ విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది.
గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire)లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు సహా మృతుల సంఖ్య 33కి చేరింది.విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది. ఈ ఘటనలో విస్తుగొల్పే విషయాలు బయటపడుతున్నాయి. గేమింగ్ జోన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయిన ఘటన బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్‌లో జరిగింది. కార్మికులు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీ శనివారం అర్ధరాత్రి రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 25మందిని కాపాడారు.
అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు గానీ.. వారు ఆడుకుంటుంటే చూస్తూ ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు గానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవదహనం అవుతామని ఊహించలేకపోయారు! కంప్యూటర్ గేమ్స్‌లో కొందరు.. జారుడు బల్లాటలో ఇంకొందరు.. ఆడుతూనే అనంత లోకాలకు చేరారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని ఓ స్ర్కాప్ దుకాణంలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు గంట పాటు భారీ ఎత్తున నల్లటి పొగతో కూడిన మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న పరిశ్రమ కార్మికులు,
గుజరాత్ లోని రాజ్‌కోట్ సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్లో పెద్దఎత్తున మంటలు చెలరేగి 24 మంది చనిపోయారు. మృతులలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థానే జిల్లా డోంబివిలిలో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడ్డాయి. ఫ్యాక్టరీలో గల నాలుగు బాయిలర్లు పేలడంతో ప్రమాదం జరిగింది. మంటలు అంటుకోవడంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న రసాయనాలకు అంటుకున్నాయి. దాంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కొందరిని రక్షించారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
సోమందేపల్లి మండలం గుడిపల్లి పంచాయతీ పరిధిలో ఇండసి్ట్రయల్ ఏరియాలో ఉన్న ఎస్ఎల్ఏపీ పరిశ్రమలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కియ కార్లకు విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలో ఎస్ఎల్ఏపీ ఒకటి. ఇక్కడ కార్లకు సంబంధించి ఏసీ, గ్లాసులు తయారు చేస్తారు.