Home » Floor Assistants
విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ.. ప్రకృతి ప్రకోపానికి గురైంది..! పశ్చిమ కనుమల నడుమ.. తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్పై విపత్తు విరుచుకుపడింది..! తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు.. బురదతో కూడిన వరద.. విరిగిపడ్డ కొండ చరియలు.. వెరసి సోమవారం అర్ధరాత్రి
భారీ వర్షాలకు ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా,