Home » France
విలన్‌ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్‌ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్‌లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్‌ను ఆపి మిషన్ గన్లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2024 జాబితాలో భారత్ 85వ ర్యాంకుకు పరిమితమైంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ భారత పర్యటనతో చైనా అప్రమత్తమైంది. భారత్ - ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో మాక్రాన్‌ను తన వైపు తిప్పుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) కుయుక్తులు పన్నుతున్నారు.
భారత గణతంత్ర వేడుకలకు(India Republic Day - 2024) ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్(Emmanuel Macron) భారత్ - ఫ్రాన్స్ మధ్య మైత్రిని బలపరిచే ప్రక్రియలో కీలక ముందడుగు వేశారు. 2030 నాటికి 30 వేల భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఏడాదిలాగే ఈ గణతంత్ర దినోత్సవానికి(India Republic Day 2024) ఢిల్లీలో జరిగే పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముఖ్య అతిథి రాబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron)కు ఈ మేరకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు.
మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.
మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.
దుబాయి నుంచి 300 మంది భారతీయులను అక్రమంగా రవాణా(Human Trafficking) చేస్తున్నారన్న సమాచారం అందటంతో సదరు ఫ్లైట్‌ని ఫ్రాన్స్ అధికారులు తమ దేశంలో ఆపేశారు. తరువాత చెకింగ్ చేయగా నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి.
భారత గణతంత్ర వేడుకలకు(India RepublicDay) హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు జులైలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు.