Home » Ganesh Chaturthi
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరిలో ఈ ఘటన వెలుగుచూసింది. వినాయక నిమజ్జనం చేసే క్రమంలో క్రైన్ వైర్ పట్టు వదలడంతో గణేశుడి విగ్రహం ట్రాక్టర్‌లో పడిపోయింది.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుతీశారు. కాగా, ఇవాళ(శుక్రవారం) పదో రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాగ్యనగరంలో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఖైరతాబాద్ ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిప్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ చూసినా భక్తజనమే కనిపించింది.
నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
గోషామహల్ నియోజకవర్గం ఆగాపురాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెట్‌పలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
ప్రతి ఏటా గణేశ్ చతుర్థి వచ్చిదంటే చాలు దేశవ్యాప్తంగా వీధివీధినా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. తమకు నచ్చిన ఆకారాల్లో తయారు చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమాల యాక్టర్ల గెటప్ ల్లోనూ వీటిని తయారు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది.
ఖైరతాబాద్ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంతగా బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతి వద్దకు వస్తుండటంతో పోలీసులు హై అలర్ట్‌గా ఉన్నారు.
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం ప్రతిసారి ఒక కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత.