Home » Ganesh Nimajjanam
చార్మినార్ వద్ద బురఖా ధరించి తిరుగుతున్న యువతి కలకలం సృష్టించింది. బురఖా ధరించి ప్రియుడితో కలిసి చార్మినార్ వద్ద యువతి స్థానికులకు కనిపించింది. యువతిని గుర్తించి స్థానిక ముస్లిం యువకులు పట్టుకున్నారు.
కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిమజ్జనం ప్రక్రియను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. రూ.లక్షల్లో వేలం పాట పడి సొంతం చేసుకుంటారు. ఆ లడ్డూ మహా ప్రసాదంతో మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.
Telangana: గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా త్వరగా గణేష్ నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు.
Telangana: ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎప్పుడో.. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ మండపం వద్ద సరదాగా మొదలైన లడ్డూ వేలం పాట ఇప్పుడో ట్రెండ్!
ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి నుంచి.. గల్లీల్లోని గణనాథుల వరకు మంగళవారం నిమజ్జనానికి కదలనున్నారు.
హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నిమజ్జన వేడుకల్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం సుమారు 200 మంది షీ టీమ్స్ పోలీసులు మఫ్టీలో విధుల్లో ఉన్నారని మహిళా భద్రత, షీటీమ్స్ డీసీపీ కవిత ధార తెలిపారు.
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. నిర్దేశించిన మార్గంలో భారీ వినాయకులను తరలించాలని సూచించారు.
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.