Home » Ganesh
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు.
Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.
ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్(Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు.
నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు(సోమవారం) పరిశీలించారు.
శ్రావణమాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉంటారు. వినాయక చతుర్థితి వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్‌తో పండుగ చేస్తారు. వినాయకుడికి సైతం నాన్‌వెజ్ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్తగా పెళ్లైన కూతురు, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటారు. ఈ విచిత్ర ఆచారం ఎక్కడుంది? వారు ఎందుకిలా చేస్తారు? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
వినాయక చవి తి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి న వినాయక విగ్రహాల నిమజ్జన ర్యాలీ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాయచోటి ఇనఛార్జ్ డీఎస్పీ ఎన.సుధా కర్ తెలిపారు.
పెన్సిల్ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్.
గణేశుడు జీవితంలోని ప్రతి అంశంలో మనకు కొత్త పాఠాన్ని నేర్పిస్తాడు. ఈ క్రమంలో గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏదైనా పని లేదా ఆచారాన్ని ప్రారంభించే ముందు వ్యాపారవేత్తలు సహా అనేక మంది గణేశుడి నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెబుతారు. అందుకోసం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది.
ఖైరతాబాద్(Khairatabad) భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.