Home » GHMC
హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆ హోటల్‌ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసారు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
GHMC: జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. నేటితో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయగా..
సందర్శన వేళల్లో అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) ఆదేశాలు జారీ చేశారు.
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
‘పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చాం. చిన్న గుడిసెలో తలదాచు కుంటున్నాం. కొద్దిగా సమయం ఇస్తే మేమే ఖాళీ చేసేస్తాం సారూ..’ అని వేడుకొన్నప్పటికీ అధికారులు కనికరించలేదు. జవహర్‌నగర్ కార్పొరేషన్(Jawaharnagar Corporation)లోని దేవేందర్‌నగర్‌లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను పోలీసుల బందోబస్తు మధ్యన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు.
జిహెచ్ఎంసి రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ(BJP) వంద సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్‌రెడ్డి(Lankan Deepak Reddy) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్(Congress, BRS) పార్టీలతో ప్రజలు విరక్తి చెందారని తెలిపారు.
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్(HMDA Master Plan)ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి(S Mallareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Food Safety Officers Raids: హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉక్కుపాదం మోపుతోంది.
వ్యాపార సంస్థలు జీహెచ్‌ఎంసీ(GHMC)కి ఇచ్చిన వ్యాపార పన్ను చెల్లింపు చెక్ బౌన్స్(Check bounce) అయిందా.. అయితే దుకాణానికి తాళమే.. చందానగర్ సర్కిల్ పరిధిలో 2025-26 వార్షిక సంవత్సరానికి చెల్లించాల్సిన వ్యాపార పన్నును వివిధ రకాలుగా చెల్లించవచ్చు.