Home » GHMC
వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో జరగనున్న నిమజ్జనానికి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో..
హైదరాబాద్ మహానగర స్థిరాస్తి రంగంలో పురోగతి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీ, తద్వారా సంస్థకు వచ్చిన ఆదాయం భారీగా పెరిగింది.
హెచ్-సిటీలో భాగంగా భారీ స్థాయిలో వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించనున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనకు అంతర్గత డిజైనింగ్ సెల్ (ఇన్-హౌస్ డిజైనింగ్ సెల్)ను ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేటర్ పరిధిలో మీటరు లేని నల్లా కనెక్షన్ దారులపై వాటర్‌బోర్డు కొరడా ఝళిపించనుంది. ఇకనుంచి నల్లా కనెక్షన్లకు మీటర్లు తప్పనిసరి చేయాలని బోర్డు నిర్ణయించింది. నగరంలో ఉచిత తాగునీటి పథకం కింద నెలకు అర్హత ఉన్న ప్రతీ కనెక్షన్‌కు 20వేల లీటర్లను పంపిణీ చేస్తుండడంతో తగ్గిపోయిన ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది.
హైదరాబాద్ మెట్రో రైలులో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో వాటిని అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య ఈ గ్రీన్ చానల్ చేపట్టారు.