Home » GHMC
ఉస్మానియా నూతన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని దాదాపు 32 ఎకరాల్లో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durishetti) తెలిపారు. నగరం నడిబొడ్డున నిర్మించనున్న భవనాన్ని కార్పొరేట్‌కు దీటుగా చేపట్టి తెలంగాణకు రోల్ మోడల్‌గా ఉంచుతామన్నారు. గోషామహల్ పోలీస్ స్టేడియంను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.
‘వాట్ ఈజ్ హ్యాపెనింగ్. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా’ అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్(M. Danakishore) ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఏందీ చెత్తా చెదారం? నీటి నిల్వలు ఉంటే దోమలు వృద్ధి చెందవా? ఇంత అధ్వానంగా ఉంటే వ్యాధులు ఎందుకు రావు? మీరంతా ఏం చేస్తున్నారు? క్షేత్రస్థాయిలో పర్యటించరా?’ అని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్(Hyderabad Collector Anudeep) జీహెచ్ఎంసీ ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఖాదర్‌పై అసహనం వ్యక్తం చేశారు.
మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.
అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..!
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణల కూల్చివేతలను మరింత ముమ్మరం చేసేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) రంగం సిద్ధం చేస్తోంది. క
‘చెరువుల పరిరక్షణ ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు అంతకంటే ప్రధానం. చెరువు ఎఫ్టీఎల్లో విద్యా సంస్థల భవనాలుంటే.. యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తాం’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) కమిషనర్ రంగనాథ్ అన్నారు.
జన్వాడ ఫామ్‌హౌ్‌సను బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అదీ సాక్షాత్తూ బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది. ఈ ఫామ్‌హౌ్‌సకు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్ నాలాపైనే నిర్మించారు.
గతంతో పోలిస్తే నగరంలో డెంగీ, చికున్ గున్యా(Dengue, Chikungunya) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి 16 మంది చికున్ గున్యా బారిన పడ్డారని అధికారిక లెక్కలు చెబుతుంటే.. కూకట్పల్లి బాలాజీనగర్(Kukatpally Balajinagar)లోని 8 ఫ్లాట్లు గల ఒక్క అపార్ట్మెంట్లోనే నలుగురు బాధితులు ఉండడం గమనార్హం.
మెట్రోరైళ్లలో(Metro trains) అదనపు కోచ్‌ల అంశమే అడ్రస్ లేకుండా పోయింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా 40 నుంచి 50 బోగీలను నాగ్‌పూర్(Nagpur) నుంచి తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని గతంలో సూచనప్రాయంగా ప్రకటించిన హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.